చెన్నై: India vs Bangladesh: మూడవ రోజు భారత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. రిషభ్ పంత్ మరియు శుభ్మన్ గిల్ సెంచరీలతో కదం తొక్కారు.
దీంతో భారత్ భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు రిషభ్ అశ్విన్ జంట మంచి స్కోరును చేసింది.
287 కు 4 వికెట్లు కోల్పోయిన తరుణంలో భారత్ తన 2వ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లా ముందు భారీ స్కోరు నిలిపింది.
బంగ్లా ఇప్పుడు ఈ మ్యాచ్ గెలవాలంటె 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంది. అయితే 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా అప్పుడే 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చెసింది.
రిషభ్ పంత్ 109, శుభ్మన్ గిల్ 119 పరుగులు చేసి భారత్ కు మంచి ఆధిక్యాన్ని అందించారు. మరి బంగ్లా 2వ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో వేచి చూడాలి.