కోల్కత్తా: India vs England: భారత్ ఇంగ్లండ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఇంగ్లండ్ ను 132 పరుగులకే కట్టడి చేసింది.
భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా, హార్దిక్, అర్షదీప్ మరియు అక్షర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లంద్ బ్యాటర్లలో జోస్ బట్లర్ మాత్రమే 68 పరుగులు చేశాడు. మిగతా అందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
ఛేజింగ్ ఆరంభించిన భారత్ కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు.
శాంసన్ 26 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 79 పరుగులు చేశారు.
కాగా సూర్యకుమార్ మాత్రం డకౌట్ గా వెనుదిరిగారు.
చివరిలో తిలక్ వర్మ 19 పరుగులు, హార్దిక్ 3 పరుగులు చేశారు. భారత్ 133 పరుగులను కేవలం 12.5 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి ఛేధించింది.
ఈ విజయంతో భారత్ 1-0 లీడ్ కు చేరుకుంది.
ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన అర్షదీప్ భారత్ తరఫున టి20ల్లో 97 వికెట్లతో టాపర్ గా నిలిచారు.