అహ్మదాబాద్: భారత్ వెస్టిండీస్ పై మూడో మ్యాచ్ లో గెలిచి వన్డే సిరిస్ ను 3-0 తో గెలిచి సిరీస్ ను వైట్ వాష్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కాస్త తడబడ్డా చివరికి ఆలౌట్ అయ్యి 265 పరుగులు చేయగలిగింది.
రోహిత్ శర్మ, శికర్ ధవన్, విరాట్ కోహ్లీ తక్కువ స్కోర్లకే అవుటయినా శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ అధ్బుత భాగస్వామ్యంతో నాలుగో వికెట్ కు 110 పరుగులు జోడించారు. శ్రేయస్ 80 పరుగులు చేయగా, రిషభ్ 56 పరుగులు చేశాడు.
చేధన ప్రారంభించిన వెస్టిండీస్ ఏ దశలోనూ పూర్తి చేసే అవకాశం కనిపించలేదు. చివర్లో టెయిలెండర్లు ప్రయత్నించినా అప్పటికే మ్యాచ్ చేజరింది. భారత బౌలరలో సిరాజ్ ప్రసిద్ధ్ చెరో 3 వికెట్లు, చాహర్ కుల్దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టి భారత్ కు 94 పరుగుల ఘన విజయాన్ని అందించారు.
దీంతో భారత్ మూడు మ్యాచ్ ల సిరీస్ 3-0 ఆధిక్యంతో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ పూర్తి స్తాయి కెప్టెన్ గా తొలి సిరీస్ సొంతం చేసుకున్నాడు.