పారిస్: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ కు పతకాల పంట. ఈ ఈవెంట్ లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది.
పురుషుల హై జంప్ T47 ఈవెంట్‌లో నిషాద్ కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. టోక్యోలో మూడు సంవత్సరాల క్రితం జరిగిన పోటీలో కూడా రెండో స్థానం సాధించిన నిషాద్, ఈసారి 2.04 మీటర్ల సీజన్ బెస్ట్ సాధించాడు.
మరోవైపు, ప్రీతి పాల్ మహిళల 200 మీటర్ల ట్35 ఫైనల్‌లో కాంస్య పతకం సాధించి, చరిత్ర సృష్టించింది.
ఇక, బ్యాడ్మింటన్‌లో నితేశ్ కుమార్ మరియు సుహాస్ యతిరాజ్ లు వరుసగా SL3 మరియు SL4 విభాగాల్లో ఫైనల్స్‌కి చేరుకొని కనీసం రజత పతకం గెలవడం ఖాయమైంది.
మరోవైపు, సుకాంత్ కడమ్ SL4 విభాగంలో సెమీఫైనల్‌లో సుహాస్ యతిరాజ్ చేతిలో ఓడిపోయి, ఇప్పుడు కాంస్య పతకం కోసం పోటీపడనున్నాడు.
భారత తులసిమతి మురుగేశన్, మహిళల సింగిల్స్ SU5 విభాగం సెమీఫైనల్‌లో మనీషా రామదాస్‌ను ఓడించి, కనీసం రజత పతకం ఖాయమైంది.
ఇక, మనీషా రామదాస్ కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. ఇప్పటి వరకు భారత్ మొత్తం ఏడు పతకాలు గెలుచుకుంది.