అహ్మదాబాద్: భారత్ ఇంగ్లండ్ మూడో టెశ్ట్ పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘనమైన విజయాన్ని నమోదు చేసింది. కేవలం 49 పరుగులు స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. విజయానికి 49 పరుగులు అవసరమైన వేళ భారత్ వికెట్ నష్ట పోకుండా గెలిచింది.
పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. దీంతో 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో స్టోక్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే.. రూట్ 19 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికట్లు, అశ్విన్ 4, సుందర్ ఒక వికెట్ తీశాడు.
ఇంగ్లండ్ జట్టును అశ్విన్ తన రెండు వరుస ఓవర్లలో దెబ్బకొట్టాడు. అశ్విన్ రెండావ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేళ్ 5 వికెట్లతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో సిరీస్ లో 2-1 తో ఆధిక్యం లో ఉంది.