అహ్మదాబాద్: వెస్టిండీస్ తో జరిగిన రెండవ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 237 పరుగులు మాత్రమే చేసింది. ఎంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ భారత్ చేసింది కేవలం 237 పరుగులే.
అయితే వెస్టిండీస్ కు ఈ లక్ష్యాం ఛేదించడం కష్టం కాదు, అయితే భారత బౌలర్లు వారికి ఆ అవకాశం ఏ దశలోనూ ఇవ్వలేదు. పదునైన బౌలింగ్‌తో విండీస్ బ్యాట్స్ మెన్లను కట్టి పడేశారు. తక్కువ స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపడుకుని సిరీస్‌ను గెలిచారు.
భారత్ ఆ మాత్రం స్కోరు చేయడానికి కారణం సూర్యకుమార్ యాదవ్ (83 బంతుల్లో 64; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించడం. తనకు తోడుగా కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. చేధనలో వెస్టిండీస్ 46 ఓవర్లలో కేవలం 193 పరుగులకు ఆలౌటయ్యింది.
వెస్టిండిస్ షామర్ బ్రూక్స్ (64 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (4/12) ప్రత్యర్థి వికెట్లను పడగొట్టడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–0తో గెలుచుకోగా, శుక్రవారం చివరి వన్డే జరగనుంది.