రాంచీ: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది, అలాగె ఈ గెలుపుతో సిరీస్ ను కూడా సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ధాటిగా బ్యాటింగ్ చేసినప్పటికీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో 154 పరుగులకే ఇన్నింగ్స్ ముగిసింది.
కాగా 154 పరుగులను చేధించడం ఆరంభించిన టీమిండియాకు రోహిత్(55), రాహుల్(65)లు తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యంతో జోడించి పటిష్టమైన పునాది వేశారు. దీంతో లక్ష్యాన్ని సులువుగానే చేధించింది భారత్. చివర్లో ఓపనర్లు ఇద్దరూ అవుటయినప్పటికీ పంత్(12 పరుగులు) వరుసగా రెండు సిక్సర్లతో టీమిండియాను గెలిపించాడు.
తొలి వికెట్ పడ్డ తరువాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెండో టీ20 లో విజయంతో టీమిండియా మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంకొక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది.