న్యూఢిల్లీ: సోమవారం సీఈఓగా పరాగ్ అగ్రవాల్(45)ను తమ కంపెనీ కు కొత్త సీఈవోగా ట్విటర్ కంపెనీ ప్రకటించింది. అయితే ప్రపంచంలో అరడజనుకు పైగా దిగ్గజ టెక్ కంపెనీలకు భారతీయ-అమెరికన్లు సీఈవోలుగా పని చేస్తున్నారు. ఆ దిగ్గజ కంపెనీల్లో ప్రముఖమైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం లాంటి సంస్థలను భారతీయులు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలోకి ట్విట్టర్ కూడా వచ్చి చేరింది. తాజాగా కొత్త సీఈఓగా నియమితులైన పరాగ్ అగర్వాల్ కూడా భారత సంతతికి చెందిన వాడే అవడం విశేషం.
పరాగ్ నియామకంతో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం భారత సంతతి వ్యక్తుల జాబితా ఈ క్రింద:
సుందర్ పిచాయ్: సుందర్ పిచాయ్ ఆగస్టు 2015లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్, సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ తర్వాత సంస్థ మూడవ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సుందర్ పిచాయ్ ఎన్నికయ్యారు.
సత్య నాదెళ్ల: సత్య నాదెళ్ల 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ఆయన ఆ కంపెనీ చైర్మన్‌గా కూడా ఎదిగారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాప్ట్ సంస్థకు ఛైర్మన్, సీఈఓగా కొనసాగుతున్నారు.
అరవింద్ కృష్ణ: అరవింద్ కృష్ణ అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబిఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా 2020 జనవరిలో నుండి పని చేస్తున్నారు. గిన్ని రోమెట్టి పదవి నుంచి తప్పుకున్నాక జనవరి 2020లో ఐబీఎం సీఈఓగా అరవింద్ కృష్ట ఉన్నారు.
శంతను నారాయణ్: శంతను నారాయణ్ డిసెంబర్ 2007 నుంచి అడోబ్ ఇంక్ చైర్మన్, అధ్యక్షుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. అంతక ముందు 2005 నుంచి కంపెనీ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు.
రంగరాజన్ రఘురామ్: రంగరాజన్ రఘురామ్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ విఎంవేర్ కొత్త సీఈఓగా 2021 జూన్ నెలలో ఎంపికయ్యారు. 2003లో కంపెనీలో చేరిన రఘురామ్ జూన్ 1న సీఈఓ పదివిని చేపట్టారు. విఎమ్ వేర్ ప్రధాన వర్చువలైజేషన్ వ్యాపారాన్ని విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
జయశ్రీ ఉల్లాల్: జయశ్రీ వి. ఉల్లాల్ అరిస్టా నెట్‌వర్క్స్ సీఈఓగా 2008 నుంచి కొనసాగుతున్నారు. అంతకు ముందు ఆమె ఏఎండీ, సిస్కో కంపెనీల్లోనూ సేవలు అందించారు.
లక్ష్మణ్ నరసింహన్: క్రితంలో పెప్సికోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా ఉన్న లక్ష్మణ్ నరసింహన్ సెప్టెంబర్ 2019లో రాకేష్ కపూర్ తర్వాత రెకిట్ బెంకిసర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు.
రాజీవ్ సూరి: రాజీవ్ సూరి ఒక సింగపూర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, మార్చి 1 2021 నుంచి ఇన్మార్శాట్ సీఈఓగా పనిచేస్తున్నారు. అంతకు ముందు వరకు నోకియా సీఈఓగా ఉన్నారు.
దినేష్ సి. పాల్వాల్: పాల్వాల్ 2007 నుంచి 2020 వరకు హర్మన్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా పనిచేశారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత అతను సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడు డైరెక్టర్ల బోర్డుకు సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు.
పరాగ్ అగర్వాల్ : ప్రస్తుత ట్విట్టర్ సీఈఓ నియమితులైన పరాగ్ అగర్వాల్ 2011లో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరి తన ప్రతిభతో 2018లో ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా హోదా చేజిక్కించుకున్నారు. మరో 4 ఏళ్లలోపే ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా ఎదిగారు.