ముంబై: ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మిశ్రమ ఫలితాలను ఎదుర్కొన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్‌ను కోల్పోయి 31వ స్థానానికి పడిపోవడం అభిమానులను నిరాశలోకి నెట్టింది.
ఇదే సమయంలో, విరాట్ కోహ్లీ 20వ స్థానంలో ఉండగా, రిషబ్ పంత్ 9వ ర్యాంక్‌ను నిలబెట్టుకోవడం ఊరట కలిగించింది.
ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ అగ్రస్థానానికి చేరడం టెస్టు క్రికెట్‌లో కొత్త తరానికి ప్రేరణగా నిలిచింది. మరోవైపు భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ 4వ ర్యాంక్‌తో తన ప్రతిభను కొనసాగిస్తున్నాడు.
శుభ్‌మాన్ గిల్ తన ర్యాంక్‌ను కాస్త మెరుగుపరచాడు. తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి తన ఆడతీరు మెరుగుపరుచుకుంటూ 69వ ర్యాంక్‌కు చేరాడు.
ఇటీవలి కాలంలో భారత ఆటగాళ్ల ర్యాంకుల్లో పడిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేసినప్పటికీ, యువ క్రికెటర్ల ప్రదర్శన దేశానికి భవిష్యత్ ఆశలను పెంచుతోంది.