బాలీవుడ్: ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తుంది. రీజనల్ సినిమా నుండి నేషనల్ సినిమా వరకు అన్ని భాషల్లో బయోపిక్ సినిమాలు పెరిగాయి. మొదట్లో బయోపిక్స్ పద్దతిగా ఉన్నది ఉన్నట్టు తీసేవారు. ఇప్పుడు బయోపిక్ తో పాటు సినిమాటిక్ లిబర్టీస్ అని డ్రామా కోసం, సీన్స్ ని పండించడం కోసం లేనివి కూడా కల్పించి సినిమాని ఖూనీ చేస్తున్నారు. అలాంటి ఒక ప్రయత్నం చేసిన ‘గుంజన్ సక్సేన’ టీం కి ఎదురుదెబ్బ తగిలింది.
‘గుంజన్ సక్సేన‘ – ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసిన మొదటి లేడీ పైలట్. కార్గిల్ లో యుద్ధం చేసి దేశం కోసం సేవలందించిన మొదటి లేడీ పైలట్ ఆధారంగా తీసిన సినిమా ఇది. కానీ సినిమా కోసం కొన్ని సీన్స్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆడవాల్లని ట్రీట్ చేసే విధానం తప్పుగా చూపించారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెన్సార్ బోర్డు వాల్లకి లేఖ రాసింది.
ఇలాంటి సినిమాలు తీసినప్పుడు అవి అందరిని ఉత్తేజ పరచేలా ఉండాలి. బయో పిక్ అంటే అందులోని కథని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది సామాన్య ప్రజలు కూడా ఆ స్థాయిని చేరుకునే ఆశలు రేకెత్తించేలా ఉండాలి. కానీ సినిమాలో డ్రామా కోసం అందులో దేశాన్ని రిప్రెసెంట్ చేసే సైన్యం విషయంలో ఇలా నెగటివ్ గా లేదా తక్కువగా చేసి చూపించడం వల్ల దాని ప్రభావం చాలా ఉంటుంది. ఆ ప్రొఫెషన్ ని ఎంచుకునే వాళ్ళు వెనకడుగు వేసే ప్రమాదం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇకముందు ఇలాంటి సినిమాలు తీసేపుడు కొంచెం జాగ్రత్తగా తీస్తే బాగుంటుంది.