టాలీవుడ్: ఒకప్పుడు సినిమా అంటే ఇదే కాన్సెప్ట్ ఉండాలి, ఇన్ని పాటలు ఉండాలి, ఇన్ని ఫైట్స్ ఉండాలి అని కొలతలు పెట్టుకుని ఉండేవి. ఇప్పుడు కూడా అలాంటి సినిమాలు వస్తున్నాయి కానీ జనాలు అలాంటి సినిమాలని తిరస్కరించాస్తున్నారు. మారుతున్న కాలం తో సినిమా కథలు, సినిమాలు తీసే విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. రకరకాల బ్యాక్ డ్రాప్స్ తో సినిమాలు రూపొందుతున్నాయి. ఇపుడు సరిగ్గా అలాంటి ఒక అడ్వెంచర్ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా రూపొందుతుంది. ఆఫ్-రోడ్ మడ్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ‘మడ్డి’ ఇంగ్లీష్ లో MUDDY అనే సినిమా రూపొందుతుంది. భారతదేశంలోనే మొదటి 4×4 మడ్ రేసింగ్ సినిమా ఇది. ప్రపంచంలోనే ఈ బ్యాక్ డ్రాప్ లో ఇదే మొదటి సినిమా అయి ఉండొచ్చు అని మేకర్స్ ప్రకటించారు.
4×4 మడ్ రేసింగ్ అనేది ఆఫ్-రోడ్ మోటార్ స్పోర్ట్స్ లో ఒక భాగం. బురదలో సాగే రేసింగ్ నేపథ్యం లో అడ్వెంచరస్ యాక్షన్ సినిమాగా రూపొందనున్నట్టు ఈరోజు విడుదలైన మోషన్ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. ఈ మోషన్ పోస్టర్ ని కోలీవుడ్ టాప్ హీరో విజయ్ సేతుపతి విడుదల చేసారు. పికె7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగభల్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు.