జాతీయం: దేశపు “బిలియన్త్ బేబీ” ఆస్థా అరోడా: పుట్టినప్పుడు సెలబ్రిటీ, ఇప్పుడు ఆర్మీ నర్స్‌గా”
భారతదేశంలో 2000 సంవత్సరంలో మే 11న ఉదయం 5:05 గంటలకు సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో ఒక చిన్నారి జన్మించింది. ఈ చిన్నారి భారతదేశం యొక్క 100 కోట్ల జనాభాకు చేరుకునే క్షణం మాత్రమే కాదు, దానికి ‘బిలియన్త్ బేబీ’ అనే గౌరవం కూడా అందింది. ఈ పసికందు జన్మించిన సమయంలోనే, దేశవ్యాప్తంగా సెలబ్రిటీగా మారింది.
ఆస్థా అరోడా పుట్టిన రోజు ఆసుపత్రిలో కోలాహలంగా మారింది. తన తండ్రి అశోక్ అరోడా చెప్పినట్లుగా, ‘‘నా భార్యకు డెలివరీ సమయంలో నా లేబర్ గదిలో నేను ఉన్నాను. నేను టీ తాగి వచ్చేసరికి, మా బిడ్డ బిలియన్త్ బేబీగా ప్రకటించబడింది. ఈ వార్త వచ్చి, ఆ సమయంలో ఆసుపత్రిలో VIPలంతా, నర్సులు, రాజకీయ నేతలు మా బిడ్డతో ఫొటోలు దిగారు.’’
అప్పటికే, ఆస్థా తండ్రి కిరాణా దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి కాగా, అతని కుటుంబం ఆ సమయంలో రాజకీయ నేతల నుంచి అనేక హామీలను అందుకుంది. ఆస్థాకు ఉచిత విద్య ఇచ్చే హామీ ఇస్తూ, పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. కానీ, ఈ హామీలకు కింద ఏ ఆర్థిక సహాయం లేదా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదు, వారికీ వాటి మీద అవగాహన కూడా లేదు. రాజకీయ నేతలు ఇచ్చిన హామీలతో తన బిడ్డకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మురిసిపోయిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది.
ఆర్థిక పరిస్థితుల కారణంగా, ఆస్థా కుటుంబం ఆమెను ప్రభుత్వ కళాశాలకి పంపించింది. డాక్టర్ కావాలని కలలు కంటున్న ఆస్థా, ఆర్థిక సమస్యల కారణంగా నర్స్‌గా మారింది. తన నర్సింగ్ పూర్తి చేసి, మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఇప్పుడు ఆమె ఆర్మీలో నర్సింగ్ లెఫ్టినెంట్‌గా విధులు నిర్వహిస్తోంది.
బిలియన్త్ బేబీ అయిన ఆస్థా ఇప్పుడు ఒక సాధారణ జీవితం గడుపుతోంది. ఆమె సోదరుడు మయాంక్ కూడా ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి తమ సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.