ఢిల్లీ: దేశీయంగా భారతదేశంలో అత్యధిక విమానాలు నడుపుతున్న ఇండిగో ఎయిర్ లైన్, ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థల ర్యాంకింగ్స్‌లో 103వ స్థానాన్ని పొందింది.
జనవరి నుంచి అక్టోబర్ 2024 వరకు ఉన్న డేటా ఆధారంగా, ఎయిర్ హెల్ప్ సంస్థ ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
ప్రయాణికుల అభిప్రాయం, సమయపాలన, సేవల నాణ్యత వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించబడ్డాయి.
భారతదేశంలో మార్కెట్ లీడర్‌గా ఉన్నప్పటికీ, ఇండిగో ర్యాంకింగ్ ప్రపంచ స్థాయిలో దిగువన ఉంది. సేవల నాణ్యతలో అభివృద్ధి లేకపోవడం, ప్రయాణికుల అసంతృప్తి ప్రధాన కారణాలుగా కనిపిస్తోంది.
ఇండిగోతో పాటు, ఇతర చెత్త ఎయిర్ లైన్స్‌లో తునిసైర్ (109), బజ్ (108), నౌవెలైర్ (107) మొదలైన సంస్థలు ఉన్నట్లు ఈ ర్యాంకింగ్స్‌లో చూపించారు.
ఇదే సమయంలో, బ్రస్సెల్స్ ఎయిర్ లైన్స్ అగ్రస్థానానికి చేరుకుంది. గతంలో అగ్రస్థానంలో ఉన్న ఖతార్ ఎయిర్ వేస్ రెండో స్థానానికి పడిపోయింది. యునైటెడ్ ఎయిర్ లైన్స్, అమెరికన్ ఎయిర్ లైన్స్ వంటి సంస్థలు కూడా అత్యుత్తమ సంస్థల జాబితాలో ఉన్నాయి.