ఆడిలైడ్: ఆస్ట్రేలియా ఇంగ్లండ్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా రెండవ టెస్ట్‌కు దూరమయ్యాడు. యాషెస్ తొలి టెస్ట్‌లో 94 పరుగులు సాధించి తొలి టెస్టు విజయంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. వార్నర్ స్ధానంలో ఉస్మాన్ ఖవాజా తుది జట్టులోకి రానున్నాడు.
కాగా మొదటి టెస్ట్‌లో ఘన విజయం సాధించిన ఆసీస్, యాషెస్ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. రెండో టెస్ట్ ఆడిలైడ్ వేదికగా డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం అవనుంది. అయితే ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజల్‌వుడ్ కూడా రెండో టెస్ట్‌కు గాయంతో ఈ పాటికే దూరమయ్యాడు.
ఆస్ట్రేలియా జట్టు( అంచనా): పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ మార్కస్ హారిస్ అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, జో రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్.