టాలీవుడ్: ఒక సినిమా ఎంత బడ్జెట్ తో రూపొందినా, ఎంత పెద్ద స్టార్ హీరోలు నటించినా, పెద్ద ప్రొడక్షన్ టీం అయినా మొదటి రోజు జనాలు థియేటర్లలో అడుగు పెట్టాలంటే ప్రొమోషన్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడున్న కాలంలో సినిమా ఎంత బాగున్నా మొదటి వారం , రెండవ వారం మహా అయితే మూడు వారల తర్వాత సినిమా థియేటర్లలోంచి కనుమరుగవుతుంది. కాబట్టి ఒక సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుంది అనేది మొదటి వారం తెలుస్తుంది అది కూడా సినిమా ప్రొమోషన్ పైన ఆధారపడుతుంది.
ఈ మధ్య కాలంలో జాతి రత్నాలు టీం ప్రొమోషన్ చాలా కొత్తగా చేసింది. రెగ్యులర్ గా వాడే ప్లాట్ ఫార్మ్స్ వాడినా కూడా వాళ్ళ ప్రొమోషన్ కొత్తగా అనిపించింది. దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుని ఇప్పుడు సూపర్ సక్సెస్ సాధించింది ఈ సినిమా. విడుదలైన రెండు వారాలకి కూడా ఇంకా ప్రొమోషన్ చేస్తూ సినిమాకి జనాదరణ పెరిగేలా చూస్తున్నారు ఈ సినిమా టీం.
కీరవాణి కుమారుడు శ్రీ సింహ హీరోగా నటిస్తున్న ‘తెల్లవారితే గురువారం’ సినిమాకి కూడా హీరో ని కిడ్నాప్ చేసినట్టుగా ఒక వీడియో తీసి రాజమౌళి సినిమా RRR అప్ డేట్ ఇస్తే కానీ వదిలెయ్యం అంటే దానికోసం వాళ్లే వస్తారు వాళ్లనే అడగండి అంటూ ఒక ప్రమోషనల్ వీడియో తీసి సినిమా ప్రచారం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారు రూపొందిస్తున్న ‘ఏక్ మినీ కథ’ అనే సినిమా కోసం ఇంచు మించు ఈ కాన్సెప్ట్ నే వాడుకున్నారు. రాధే శ్యామ్ మూవీ అప్ డేట్ పేరుతో ఈ చిన్న సినిమా ని కూడా ప్రమోట్ చేసుకున్నారు.
ఇవే కాకుండా ప్రస్తుతం మ్యూజికల్ ఫెస్ట్ అని వకీల్ సాబ్ సినిమా కోసం థమన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ తమ సినిమా ప్రొమోషన్ మొదలుపెట్టారు. రానా అరణ్య సినిమా, మరియు క్రికెట్ ని మిక్స్ చేస్తూ తన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. నితిన్ రంగ్ దే ప్రొమోషన్ కోసం ట్విట్టర్ లో కీర్తిసురేష్ కనపడుటలేదు, ఎక్కడ ఉన్నా వచ్చి రంగ్ దే ప్రమోషన్స్ లో పాల్గొనాలి అని ట్వీట్ చేసాడు. ఇలా మూవీ టీమ్స్ రక రకాలుగా ప్రమోట్ చేస్తూ తమ సినిమాల్ని జనాల నోళ్ళలో నానేట్టు చూసుకుంటున్నారు.