ఇంటర్నెట్ డెస్క్: మెటా సంస్థ మరోసారి షార్ట్ వీడియోల మార్కెట్‌పై దృష్టి పెట్టింది. టిక్‌టాక్‌కు అమెరికాలో బ్యాన్ ముప్పు ఉండటంతో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రత్యేకమైన యాప్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. మెటా అధినేత అడమ్ మోస్సెరి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే రీల్స్ ద్వారా టిక్‌టాక్‌కు గట్టి పోటీ ఇస్తున్నా, ఈ కొత్త యాప్‌తో మరింత విస్తరించాలనుకుంటోంది. టిక్‌టాక్ స్టైల్‌లో వీడియో స్క్రోలింగ్, ఎడిటింగ్ ఫీచర్లు ఇందులో కొత్తగా ఉండే అవకాశం ఉంది.
ఇంతకుముందు 2018లో మెటా ‘లాస్సో’ అనే షార్ట్ వీడియో యాప్‌ను విడుదల చేసింది. అయితే, అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇప్పుడు టిక్‌టాక్‌కు పోటీగా మరోసారి ప్రయోగం చేయాలని చూస్తోంది.
కొత్త రీల్స్ యాప్‌తో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఎంగేజ్మెంట్ పెరుగుతుందా? లేక వేరే యాప్ కావడంతో ప్రభావం పడుతుందా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.