మూవీడెస్క్: ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ముఖ్యమైన వినోద మాధ్యమంగా మారిపోయాయి.
ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి రానుండటంతో వీటిపై ఆసక్తి మరింత పెరుగుతోంది.
ఈ వారం విడుదలైన సినిమాలు, సిరీస్‌ల వివరాలు ఇక్కడ చూడొచ్చు.
ఆహా OTT:
ధృవ్ సర్జా నటించిన కన్నడ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్టిన్ తెలుగులో నవంబర్ 19న ఆహాలో అందుబాటులోకి వచ్చింది. అలాగే రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో సాయి రోనక్, ప్రగ్యా నగారా జంటగా వచ్చిన ఫ్యామిలీ డ్రామా లగ్గం నవంబర్ 22న స్ట్రీమ్‌కి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో OTT:
కన్నడ సెన్సేషన్ మార్టిన్ తెలుగు వెర్షన్ నవంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది. అదేవిధంగా, రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న రానా దగ్గుబాటి షో తొలి ఎపిసోడ్ నవంబర్ 23న ప్రేక్షకులను అలరించనుంది.
నెట్‌ఫ్లిక్స్ OTT:
స్టార్ నయనతార జీవితం, ప్రయాణం గురించి వివరిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 18న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.
అలాగే శ్రీమురళీ హీరోగా హోంబలే ఫిలిమ్స్ రూపొందించిన కన్నడ మూవీ బగీరా తెలుగు వెర్షన్ నవంబర్ 21న స్ట్రీమ్‌కి వచ్చింది.
హిందీ వెబ్ సిరీస్ యే కాళీ కాళీ అంఖీన్ సీజన్ 2 నవంబర్ 22న NETFLIXలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ OTT:
మలయాళ బ్లాక్‌బస్టర్ కిష్కింధ కాందం తెలుగు వెర్షన్ నవంబర్ 19న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలైంది.
ETV విన్ OTT:
తెలుగు ప్రేమ కథాచిత్రం ఐ హేట్ లవ్ నవంబర్ 21న ఈటీవీ విన్‌లో అందుబాటులోకి వచ్చింది.