fbpx
Sunday, January 19, 2025
HomeNationalబ్రిజేష్: ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం

బ్రిజేష్: ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం

IPL-2020-STARTS-SEPTEMBER-19TH

న్యూఢిల్లీ : క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృత గా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌-2020) నిర్వహణకు సంబంధించి చైర్మన్‌ బ్రిజేష్‌ పాటిల్‌ పలు కీలక విషయాలను వెల్లడించారు.

యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు లీగ్‌ను నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తం 8 టీంలు లీగ్‌ బరిలో నిలుస్తాయని, నవంబర్ 8న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేశారు.

‘కరేబియన్‌​లీగ్‌ సెప్టెంబర్‌ 10 ముగుస్తుంది. అలాగే ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ అదే నెల 15న ముగియనుంది. ఈ మూడు దేశాల ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’ అని పాటిల్‌ తెలిపారు.

పూర్తి సమాచారం బీసీసీఐ గవర్నర్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించిన అనంతరం ప్రకటిస్తామన్నారు. మొత్తం 51 రోజుల పాటు ఈ సంవత్సరం లీగ్‌ను నిర్వహించే విధంగా షెడ్యూల్‌ను తయారు చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం అనంతరం బ్రిజేష్‌ పాటిల్‌ మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.

టీ-20 ప్రపంచ్‌ కప్‌ వాయిదా పడిన నేపథ్యంలో ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో విదేశాల్లో లీగ్‌ను నిర్వహించాలని భావించింది. దీనిలో భాగంగానే లీగ్‌ నిర్వహణకు యూఏఈ అనువైన ప్రదేశంగా గుర్తించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular