న్యూఢిల్లీ: ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్టును సమర్పించే సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 8 జట్లు తమ తుది జాబితాను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ రిటెన్షన్ నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంఛైజీ గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ఉండవచ్చు. వీళ్ల కోసం సాలరీ పర్స్‌లో 90 కోట్ల నుంచి, ఫ్రాంఛైజీ 42 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టవచ్చు. కాగా రిటైన్ జాబితాలో ఉన్న మొదటి ఆటగాడి కోసం 16 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
జట్ల వారీగా నిలబెట్టూనే ఆటగాళ్ళు:
చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్‌కే)- రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ.
కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)- సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్.
సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్): కేన్ విలియమ్సన్
ముంబై ఇండియన్స్(ఎంఐ)- రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా
రాయల్ చాలెంజన్స్ బెంగళూరు(ఆర్సీబీ)- విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్.
ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)- రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్ట్జే.
రాజస్తాన్ రాయల్స్(ఆర్‌ఆర్)- సంజూ శాంసన్(14 కోట్లు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం)
జట్ల వారీగా రిలీజ్ చేస్తున్న ఆటగాళ్ల జాబితా:
కేకేఆర్- ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పాట్ కమిన్స్.
ఎస్‌ఆర్‌హెచ్- కేన్ విలియమ్సన్ రిటెన్షన్ మినహా ఏ ఆటగాడి గురించి ఇంకా తుది నిర్ణయానికి రాలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్- శిఖర్ ధావన్, అశ్విన్, శ్రేయస్ అయ్యర్, కగిసో రబడ
రాజస్తాన్ రాయల్స్- బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, కార్తిక్ త్యాగి, రాహుల్ తెవాటియా
పంజాబ్ కింగ్స్- ఏ ఆటగాడిని కూడా రిటైన్ చేసుకోవడం లేదని సమాచారం.