స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో మళ్లీ కలసి పనిచేయనున్నాడు. రాబోయే ఐపీఎల్ 2025 సీజన్‌కి డీసీ తన కొత్త మెంటార్‌గా పీటర్సన్‌ను నియమించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
కెవిన్ పీటర్సన్ 2012-2014 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. 2014 సీజన్‌లో డీసీకి కెప్టెన్‌గా వ్యవహరించిన పీటర్సన్, దాదాపు పదేళ్ల విరామం తర్వాత మెంటార్‌గా జట్టుతో మళ్లీ కలవనుండటం క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచింది.
తాజాగా బాధ్యతలు స్వీకరించిన పీటర్సన్, హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మాట్‌లతో కలిసి పని చేయనున్నాడు.
డీసీ గత కొన్నేళ్లుగా స్టేబుల్ ప్రదర్శన ఇవ్వలేకపోవడంతో కొత్త మెంటార్‌తో మార్పులు జరుగుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈసారి ఢిల్లీ పటిష్టంగా పోటీ ఇస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.