ఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
2018 అండర్-19 వరల్డ్‌కప్ విజయంతో భారత్‌కి భవిష్యత్ స్టార్‌గా భావించబడిన పృథ్వీ షా, 75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చినా, ఎలాంటి ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేయకపోవడం వివాదంగా మారింది.
పృథ్వీ షా గత కొన్ని సీజన్లలో ప్రదర్శనలో నిలకడ చూపకపోవడం, ఫిట్‌నెస్ పట్ల నిర్లక్ష్యం, జట్టు నియమాలకు లోబడని ప్రవర్తన అతడి మీద నమ్మకం తగ్గించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందిస్తూ, షా ప్రతిభగల ఆటగాడని, కానీ అతడి సమస్యలకు అతడే కారణమని అన్నారు. క్రమశిక్షణ పోగొట్టుకున్నాడని అన్నారు.
షాపై మొదట్లో సచిన్ టెండూల్కర్, బ్రయాన్ లారా వంటి దిగ్గజాలతో పోలికలు అతడిపై ఒత్తిడిగా మారాయని, ఈ పరిస్థితులను ఎదుర్కొని తిరిగి పునరాగమనం చేయాలని పార్థ్ జిందాల్ సూచించారు.
“ఇలాంటి దెబ్బలు అవసరం. ఇవి ఆటగాళ్లను మరింత మెరుగవుతేందుకు ప్రేరేపిస్తాయి,” అని జిందాల్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పృథ్వీ షా క్రికెట్‌లో తిరిగి తన ప్రతిభను నిరూపించుకోవడం ఎంత ముఖ్యమో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో చూపించిన మెరుపులను పునరావృతం చేస్తాడా లేక ఈ సమయం అతడి కెరీర్‌కు శాసనమవుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.