fbpx
Friday, February 21, 2025
HomeBig Storyఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల.. కంప్లీట్ లిస్ట్

ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల.. కంప్లీట్ లిస్ట్

ipl-2025-schedule-released/

స్పోర్ట్స్ డెస్క్: ఈ వేసవిలో క్రికెట్ అభిమానులకు మళ్లీ ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ అందించేందుకు ఐపీఎల్ 2025 సీజన్ రాబోతోంది. బీసీసీఐ తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ మెగా టోర్నీ జరుగనుంది.

ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. మొత్తం 10 జట్లు మళ్లీ పోటీ పడనున్న ఈ లీగ్‌లో మరిన్ని థ్రిల్లింగ్ మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి.

ఈ సీజన్ లీగ్ దశ మే 18న ముగియనుండగా, ప్లేఆఫ్‌లు మే 20 నుంచి మొదలవుతాయి. మే 20న క్వాలిఫయర్-1, మే 21న ఎలిమినేటర్, మే 23న క్వాలిఫయర్-2, మే 25న గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈ టోర్నీకి ముందు, ఫిబ్రవరి 19నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. అంతర్జాతీయ టోర్నీ ముగిసిన కొన్ని రోజులకే ఐపీఎల్ స్టార్ట్ కానుంది.

క్లాసిక్ పోటీలతో సరికొత్త ఎంటర్టైన్‌మెంట్‌ను అందించేందుకు ఐపీఎల్ 2025 సిద్ధమవుతోంది. మరి ఈసారి ఏ జట్టు టైటిల్ గెలుస్తుందో చూడాలి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular