స్పోర్ట్స్ డెస్క్: నాన్ స్టాప్ క్రికెట్ కిక్ అందించేందుకు ఐపీఎల్ 2025 సీజన్ సిద్ధమవుతోంది. మార్చి 22న టోర్నీ ఆరంభమవ్వగా, మే 25న ఫైనల్‌తో ముగియనుంది. మొత్తం 10 జట్లు పోటీపడనున్న ఈ లీగ్‌లో ఎప్పటిలానే అద్భుతమైన మ్యాచ్‌లు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇప్పటికే జట్లు సన్నాహాల్లో బిజీగా ఉంటే, తాజాగా కెప్టెన్లు ప్రత్యేక ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ ఫోటోషూట్‌లో శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్), రజత్ పటిదార్ (బెంగళూరు), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్), అజింక్యా రహానే (పంజాబ్ కింగ్స్), హార్దిక్ పాండ్యా (ముంబయి ఇండియన్స్), శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్), రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్), రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్), అక్షర్ పటేల్ (లక్నో) పాల్గొన్నారు.
అయితే ఈ సీజన్‌లో ఆసక్తికర విషయం ఏంటంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మినహాయించి మిగతా అన్ని జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉన్నారు. హైదరాబాద్ జట్టుకు మాత్రం ఆసీస్ స్టార్ ఆటగాడు పాట్ కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ 2025పై భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా, కొత్త కెప్టెన్లతో కొన్ని జట్లు కొత్త వ్యూహాలతో బరిలోకి దిగనున్నాయి. ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారబోతోందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.