స్పోర్ట్స్ డెస్క్: GT vs RR: ఐపీఎల్ 2025 సీజన్‌లో అద్భుత కుర్ర హీరోగా సూర్యవంశీ వైభవ్ నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ కేవలం 38 బంతుల్లో 101 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
35 బంతుల్లో సెంచరీ నమోదు చేసి ఐపీఎల్ చరిత్రలో గేల్ తరువాత రెండో వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు.
బీహార్‌కు చెందిన ఈ కుర్రాడు, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్ వంటి స్టార్ బౌలర్లను కూడా తన పవర్‌ఫుల్ షాట్లతో అతలాకుతలం చేశాడు. పవర్ ప్లేలోనే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో చితకబాది 17వ బంతికి అర్ధశతకం పూర్తి చేశాడు. కరీం జనథ్ ఓవర్లో 30 పరుగులు సాధించి మ్యాచ్ మూడో గేర్ లోకి వెళ్లిపోయాడు.
ఒక దశలో అతని ధైర్యం మరింత రెట్టింపైంది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం అభిమానులను ఫిదా చేసింది. మొత్తం 11 సిక్స్‌లు, 7 ఫోర్లతో 101 పరుగులు సాధించిన వైభవ్, చివరకు ప్రసిద్ వేసిన యార్కర్‌కు బౌల్డ్ అయ్యాడు.
గుజరాత్ టైటాన్స్ తొలుత 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, గిల్ 84(47), బట్లర్ 50(28) రాణించారు. అయితే రాజస్థాన్ రాయల్స్ జైస్వాల్ 70(40), వైభవ్ 101(38) అద్భుత ఇన్నింగ్స్‌తో కేవలం 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది. చివరగా 3 వికెట్లు మాత్రమే నష్టపోగా రియన్ పరాగ్ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ సీజన్‌లో మంచి ఊపు అందుకుంది. ఇక 14 ఏళ్ల వైభవ్ పేరు ఇండియన్ క్రికెట్ లో కొత్త సంచలనంగా మారిపోయింది.