చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్ యొక్క మినీ వేలం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో 164 మంది ఇండియన్ ప్లేయర్లు ఉన్నారు, 125 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు.
మొత్తం 8 ఫ్రాంచైజీల్లో కలిపి 61 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా బెంగళూరులో 11 ఖాళీలు ఉన్నాయి, ఈ ఫ్రాంచైజీ చేతిలో రూ. 35.40 కోట్లు మిగిలున్నాయి. అతి తక్కువగా మూడే ఖాళీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇందుకోసం రూ. 10.75 కోట్లు అందుబాటులో ఉన్నాయి.
► స్టీవ్ స్మిత్ (కనీస ధర: రూ.2 కోట్లు)- రూ.2.20 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
► గ్లెన్ మ్యాక్స్‌వెల్(కనీస ధర: రూ.2 కోట్లు)- రూ. 14.25 కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ వేలంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి జాక్‌పాట్ కొట్టాడు. మ్యాక్స్‌వెల్‌పై చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీకి పోటీ పడగా చివరకు రూ. 14.25 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది.
►షకీబ్ ఆల్ హసన్(కనీస ధర: రూ.2 కోట్లు)- రూ. 3.20 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్
►మొయిన్ అలీ(కనీస ధర: రూ.2 కోట్లు)- రూ. 7కోట్లు- చెన్నై సూపర్‌కింగ్స్. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కొనుగోలు కోసం సీఎస్‌కే, పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరకు చెన్నై సూపర్‌కింగ్స్ 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాడు.
►శివమ్ దూబే (కనీస ధర: రూ. 50 లక్షలు) – రూ.4.40 కోట్లు- రాజస్తాన్ రాయల్స్.
► క్రిస్ మోరిస్( కనీస ధర: రూ. 75లక్షలు)- రూ. 16.25 కోట్లు- రాజస్తాన్ రాయల్స్. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్నాడు. మోరిస్ కోసం మొదట పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య భారీ పోటీ నడిచింది. అయితే రూ. 5 కోట్లు దాటగానే ముంబై పక్కకు తప్పుకోగా.. రూ.12 కోట్ల వద్ద రాయల్స్ ఎంటరైంది. దీంతో పంజాబ్, రాజస్తాన్ పోటీ పడ్డాయి. చివరకు రూ. 16.25 కోట్లకు ఆర్‌ఆర్ దక్కించుకుంది.
► డేవిడ్ మలాన్(కనీస ధర: రూ. 1.50 కోట్లు)- రూ.1.50 కోట్లు- పంజాబ్ కింగ్స్. టీ20 ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా ఉన్న మలాన్ కోసం పెద్ద పోటీ లేకపోవడంతో పంజాబ్ కనీస మద్దతు ధరకే కొనుగోలు చేసింది.
► ఆడమ్ మిల్నే(కనీస ధర : రూ.50 లక్షలు)- రూ.3.20 కోట్లు- ముంబై ఇండియన్స్
► ముస్తాఫిజుర్ రెహ్మన్( కనీస ధర : రూ. కోటి)- రూ. కోటి- రాజస్తాన్ రాయల్స్
► జై రిచర్డ్‌సన్ (కనీస ధర: రూ. 1.50 కోట్లు) – రూ. 14 కోట్లు – పంజాబ్ కింగ్స్.ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్ ఐపీఎల్ వేలంలో అదరగొట్టాడు. పంజాబ్, ఢిల్లీ, చెన్నైలు రిచర్డ్‌సన్ కోసం పోటాపోటీగా తలపడ్డాయి. కానీ చివరకు రికార్డు స్థాయిలో 14 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
► నాథర్ కౌల్టర్‌నీల్(కనీస ధర: రూ. 1.50 కోట్లు)- రూ. 5 కోట్లు- ముంబై ఇండియన్స్
► ఉమేశ్ యాదవ్(కనీస ధర: రూ.కోటి)- రూ. కోటి- ఢిల్లీ క్యాపిటల్స్
► పియూష్ చావ్లా(కనీస ధర: రూ.50 లక్షలు)- రూ. 2.40 కోట్లు- ముంబై ఇండియన్స్