మూవీడెస్క్: పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, దుర్ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు.
ఈ పరిణామాలు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీశాయి.
అల్లు అర్జున్ అరెస్ట్, అనంతరం చంచల్ గూడ జైలుకు తరలింపు, తర్వాత బెయిల్‌పై విడుదల ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, ఈ క్రమంలో మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం ఉన్నట్లు వినిపించిన పుకార్లకు తెర పడింది.
అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి తన షూటింగ్‌ను తక్షణం రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
తన సతీమణి సురేఖతో కలిసి బన్నీ కుటుంబాన్ని పరామర్శించారు. అప్పటి నుంచి చిరు, అల్లు ఫ్యామిలీ మధ్య సాన్నిహిత్యం మరింత బలపడిందని టాక్.
అల్లు అర్జున్ రీసెంట్ గా తన కుటుంబంతో చిరు ఇంటికి వెళ్లారు. అక్కడ జరిగిన సమావేశంలో కేసు తదుపరి అంశాలు, లాయర్ నడిచే దిశపై చర్చించినట్లు సమాచారం.
ప్రత్యేకంగా, చిరు సూచనలతో లాయర్‌ను నియమించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు అల్లు – మెగా కుటుంబాలు మళ్లీ ఒక్కటైనట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ పరిణామాలు రెండు కుటుంబాల మధ్య మళ్లీ ఐక్యత నెలకొన్నదని, కష్టం వచ్చినప్పుడు కుటుంబం ఎల్లప్పుడూ కలిసి ఒకటిగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.