“ఇదేనా ఇందిరమ్మ పాలన?” అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మళ్ళీ తీవ్ర విమర్శలు చేసారు.
హైదరాబాద్: తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో చోటుచేసుకున్న సంఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండారెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం తీరుపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సాయిరెడ్డి అంతిమయాత్ర పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించిన పరిస్థితుల్లో సాగింది. అంతిమయాత్రపై కూడా ఆంక్షలు విధించడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు.
“ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?”
కేటీఆర్ తన ట్విట్టర్ (ప్రస్తుతం ‘ఎక్స్’) వేదికగా మాట్లాడుతూ, “ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన?” అని ప్రశ్నించారు. మాజీ సర్పంచ్ అయిన 85 ఏళ్ల సాయిరెడ్డి ఇంటికి అడ్డంగా గోడ కట్టడం, కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టడం బాధాకరమన్నారు.
అంతేకాకుండా, అధికార కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన ఘాటుగా స్పందించారు. “ఒక పెద్దమనిషిని క్షోభకు గురిచేసి, చివరకు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి నెట్టిన ప్రభుత్వం ప్రజలకు న్యాయం ఎలా చేస్తుంది?” ప్రశ్నించారు.
అంతిమయాత్రపై ఆంక్షలు
సాయిరెడ్డి అంతిమయాత్రకు ప్రభుత్వం అనుమతులపై ఆంక్షలు విధించడం పట్ల కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది నియంతృత్వ పాలనకు నిదర్శనమని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు.
అధికారుల వివరణ
ఇదే సమయంలో, పోలీసులు వివరణ వేరే విధంగా వుంది. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామని వారు తెలిపారు. అయితే ఈ చర్యలు ఆందోళనలకు దారితీశాయి.
రాజకీయ విమర్శలు
కేటీఆర్ విమర్శలకు కాంగ్రెస్ నేతలు సమాధానమిస్తూ, బీఆర్ఎస్ అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదని పేర్కొన్నారు.