టాలీవుడ్: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది పెద్ద హీరోలతో, పెద్ద పెద్ద సినిమాల్లో నటించి పెద్దయ్యాక ఓ బేబీ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు తేజ సజ్జ. హీరో గా జాంబీ రెడ్డి సినిమాతో మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. వైవిధ్య సినిమాలు రూపొందించే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ డైరెక్టర్ తోనే హను -మాన్ అనే మరో సూపర్ హీరో సబ్జెక్టు లో హీరోగా నటిస్తున్నాడు తేజ. ఈ గ్యాప్ లో ‘ఇష్క్’ అనే సినిమాలో నటించాడు తేజ సజ్జ. ఏప్రిల్ లోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది.
ఇప్పుడు థియేటర్ లు తెరచుకుంటుండడం తో మెల్లగా సినిమా విడుదల తేదీ లు ప్రకటిస్తున్నారు. జులై 30 న సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమా థియేటర్లలో విడుదల అవనుంది. తేజ కూడా అదే రోజున ఈ సినిమాని విడుదల అవనున్నట్టు ప్రకటించారు. జులై 30 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది. మళయాళం లో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ‘ఇష్క్’ సినిమాని అదే టైటిల్ తో తెలుగు లో రీమేక్ చేసారు. ఈ సినిమాలో తేజ కి జోడీ గా ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి సమర్పణలో ఈ సినిమా రూపొందింది.