టాలీవుడ్: కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్ లు మూతపడి ఈ వారం తెరచుకోనున్నాయి. మొదటి వరుసలో తేజ సజ్జ నటించిన ‘ఇష్క్’ మరియు సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ సినిమాలు ఈ నెల 30 న విడుదల అవుతున్నాయి. ఈ సందర్భంగా సినిమా టీమ్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టాయి. రీసెంట్ గా తిమ్మరుసు టీం ప్రొమోషన్ సాంగ్ ని రూపొందించి విడుదల చేసింది. ఈ రోజు ఇష్క్ టీం ఈ సినిమా నుండి ఒక మంచి రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ విడుదల చేసింది.
‘ఆనందమానందమదికే’ అంటూ సాగే ఈ పాటని ఈరోజు విడుదల చేసింది. ఆడియో ఇదివరకే సూపర్ హిట్ అయిన ఈ పాట వీడియో కూడా రొమాంటిక్ డేట్ లాగ స్మూత్ గా సాగింది. హీరో తేజ కి మరియు హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కి మధ్య ఒక వన్ డే డేట్ లా ఈ పాత చిత్రీకరణ సాగింది. సిద్ శ్రీరామ్ వాయిస్ లో తేజ సజ్జ యాక్టింగ్ లో ఈ పాట ఆకట్టుకోనుంది.
మళయాళం లో రూపొందిన థ్రిల్లర్ మూవీ ‘ఇష్క్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని అదే టైటిల్ తో రూపొందించారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ లు అందించిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వీ. ప్రసాద్, పారస్ జైన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.రాజు అనే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. జులై 30 న విడుదలవుతున్న ఈ సినిమా మంచి టాక్ తో హిట్ కొట్టి తర్వాత రాబోయే సినిమాలకి ఆశా మార్గం అవ్వాలని ఆశిద్దాం.