fbpx
Saturday, October 19, 2024
HomeNationalఇస్రో లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. రూ. 2 లక్షల వరకు జీతం: అప్లై చేయండిలా..

ఇస్రో లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. రూ. 2 లక్షల వరకు జీతం: అప్లై చేయండిలా..

ISRO-Recruitment-ISRO-jobs-notification-released-Salary-up-to-2-lakhs-Apply

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)లో ఉద్యోగం సంపాదించడం చాలా మంది కల. ఈ నేపథ్యంలో ఇస్రో తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ తదితర విభాగాల్లో 103 ఖాళీల భర్తీకి ఇస్రో ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఖాళీల వివరాలు:

  • మెడికల్ ఆఫీసర్ (MO) – 3 పోస్టులు
  • సైంటిస్ట్/ఇంజనీర్ (SC) – 10 పోస్టులు
  • టెక్నికల్ అసిస్టెంట్ (TA) – 28 పోస్టులు
  • సైంటిఫిక్ అసిస్టెంట్ (SA) – 1 పోస్టు
  • టెక్నీషియన్ (B) – 43 పోస్టులు
  • డ్రాఫ్ట్స్‌మెన్ (B) – 13 పోస్టులు
  • అసిస్టెంట్ (ఆఫిషియల్ లాంగ్వేజ్) – 5 పోస్టులు
    మొత్తం 103 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

వేతన వివరాలు:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వేతనం పోస్టుల ఆధారంగా రూ.21,700 నుండి రూ.2,08,700 వరకు ఉంటుంది.

విద్యార్హతలు:

  • మెడికల్ ఆఫీసర్: 60% మార్కులతో MBBS పూర్తి చేసి, కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.
  • సైంటిస్ట్/ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్: M.E./M.Tech పూర్తి చేసి ఉండాలి.
  • టెక్నీషియన్: సంబంధిత విభాగంలో B.Sc డిగ్రీ.
  • డ్రాఫ్ట్స్‌మెన్: సంబంధిత ఐటీఐ సర్టిఫికెట్.
  • అసిస్టెంట్ (ఆఫిషియల్ లాంగ్వేజ్): కనీసం 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ.

వయోపరిమితి:

  • మెడికల్ ఆఫీసర్ (SD, SC): 18 నుండి 35 సంవత్సరాలు
  • సైంటిస్ట్ ఇంజనీర్ (SC): 18 నుండి 30 సంవత్సరాలు
  • ఇతర పోస్టులు: 18 నుండి 35 సంవత్సరాల మధ్య.
    SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు అక్టోబర్ 9 లోగా అధికారిక వెబ్‌సైట్ ISRO Careers ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుము రూ.100, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular