fbpx
Tuesday, January 7, 2025
HomeInternationalఅంతరిక్షంలో మొలకెత్తిన మొక్కలు: ఇస్రోకు మరో ఘనత

అంతరిక్షంలో మొలకెత్తిన మొక్కలు: ఇస్రోకు మరో ఘనత

isro-space-seeds-sprout-success

ఇస్రో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా వినూత్న ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్షంలో మొలకెత్తే విత్తనాలపై పరిశోధనల కోసం పంపిన అలసంద విత్తనాలు నాలుగు రోజుల్లో మొలకెత్తాయని ఇస్రో ప్రకటించింది.

ఈ ప్రయోగం “క్రాప్స్” (కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్) పేలోడ్‌తో పీఎస్ఎల్వీ-సీ60 రాకెట్ ద్వారా చేపట్టారు.

విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో అభివృద్ధి చేసిన ఈ పేలోడ్‌లో 8 విత్తనాలు పంపగా, వాటిలో నాలుగు మొలకలు వేసినట్లు వెల్లడించారు.

మొలకల తర్వాత ఆకులు కూడా త్వరలోనే వస్తాయని ఇస్రో ఎక్స్‌ ద్వారా వెల్లడించింది. అంతరిక్షంలో మొక్కల పెరుగుదలపై జరుగుతున్న ఈ పరిశోధనలు భవిష్యత్‌ వ్యవసాయానికి మైలురాయిగా నిలుస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అంతరిక్షంలో మొక్కల పెరుగుదల ప్రక్రియతోపాటు, రోదసిలో వ్యర్థాలను సేకరించే రోబోటిక్ హ్యాండ్, హరిత చోదన వ్యవస్థల వంటి ఆధునిక పరికరాలు కూడా ఈ ప్రయోగంలో భాగంగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular