స్ట్రాస్బోర్గ్ (ఫ్రాన్స్): ISU అంటే ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీ, ISU కి సుశాంత్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా…
వివరాల్లోకి వెళ్తే సుశాంత్ చదువుల్లో మేటి, అతను ఎంత మంచి నటుడో అంతకన్నా ప్రతిభావంతుడు. సుశాంత్ కి ఫిజిక్స్ అంటే చాలా ఆసక్తి, ఇండియా లెవెల్ లో జరిగే ఫిజిక్స్ ఒలింపియాడ్ కూడా క్రాక్ చేసాడు. ఫిజిక్స్ అన్నాస్పేస్ లో జరిగే పరిశోధనలు అన్నాచాలా ఇష్టం. ఆ ఆసక్తి తోనే సుశాంత్ చంద్రుడి పై ల్యాండ్ కొన్నాడు. అలాగే సుశాంత్ నిత్యం స్పేస్ లో జరిగే పరిశోధనల పైన వివరాల కోసం ISU ని ఫాలో ఐతుండేవాడు.
ఇదే విషయాన్ని తెలిచేస్తూ ISU ఒక నోట్ రిలీజ్ చేసింది, సుశాంత్ కి నివాళులు అర్పిస్తూ సుశాంత్ గురించి కొన్ని విషయాలు గుర్తుచేసుకుంది. సుశాంత్ స్టెమ్ ఎడ్యుకేషన్ ని నమ్మి దానికి సపోర్ట్ చేసేవాడని గుర్తు తెచ్చుకుంది. సుశాంత్ ఇదివరకే పోస్ట్ చేసిన 50 డ్రీమ్స్ లో కూడా ఈ విషయం చెప్పారు. అలాగే ISU క్యాంపస్ ని సందర్శించే అవకాశం కూడా సుశాంత్ కి లభించింది కానీ వేరే కమిట్మెంట్స్ వాళ్ళ రాలేకపోయాడు అని నోట్ ద్వారా తెలిపింది.
గొప్పవాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.