చెన్నై: లాక్డౌన్ వైరస్ను చంపకపోవచ్చు కానీ అది ఖచ్చితంగా వందలాది ఉద్యోగాలను చంపింది. తయారీ మరియు సేవల రంగంలోని ఉద్యోగులను కచ్చితంగా బాధించింది. ఐటి, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (బిపిఓ) రంగాలు ప్రస్తుతం వేతన మరియు ఉద్యోగ కోతలు చూస్తున్నాయి.
వందలాది మంది కార్మికులను జూలై వరకు అన్ పెయిడ్ లీవ్స్ తీసుకోమని, లేదా ఉద్యోగం నుండి తొలగిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏ ప్రాజెక్టులో లేని బెంచ్‌పై ఉన్నవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంది. గత ఎనిమిదేళ్లుగా కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఉద్యోగి అయిన డేనియల్ ను మే 22న విధులనుండి తొలగించారు. వారు నాకు రెండు ఎంపికలు ఇచ్చారు – నా మూడు నెలల జీతానికి సమానమైన వేతన చెల్లింపు తీసుకొని రాజీనామా చెయ్యమని లేదా కొత్త ప్రాజెక్టుల కోసం బెంచ్ మీద ఒక నెల వేచి ఉండమని. ఇందులో తిరకాసు ఏమిటంటే ఆ ఒక నెలలో కొత్త ప్రాజెక్టులు రాకపోతే పరిహారం లేకుండా కంపెనీ వదిలివేయవలసి ఉంటుంది. వారు నాకు ఆలోచించుకోవటానికి ఎక్కువ సమయం ఇవ్వలేదని అని డేనియల్ అన్నారు.
ఈ అల్లకల్లోల సమయాల్లో ఉద్యోగం కోల్పోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మరికొన్ని కంపెనీలు పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించడానికి కూడా నిరాకరించాయి. హెక్సావేర్ టెక్నాలజీస్ తన బెంచ్ ఉద్యోగులకు మే, జూన్ మరియు జూలై నెలలకు జీతాలు చెల్లించబడవని అని తెలిపింది. జూలై తరువాత బెంచ్‌లో కొనసాగుతున్న వారిని తొలగిస్తారు. లాక్డౌన్ కారణంగా కంపెనీ మూసివేయబడిన కాలానికి కార్మికులకు ఎటువంటి తగ్గింపు లేకుండా వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం మార్చి 29న అన్ని కంపెనీల యజమానులకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ సమయంలో చాలా మంది టెక్కీలు ఇంటి నుండి పని చేస్తూనే ఉన్నప్పటికీ జీతాలు చెల్లించని సమస్య తలెత్తింది.
ఇంతలో తొలగించిన ఉద్యోగులకు త్వరగా మరొక ఉద్యోగాన్ని పొందడంలో సహాయపడటానికి ఉపాధి పోర్టల్స్ ప్రత్యేక సహాయాన్ని అందిస్తున్నాయి. నౌక్రీ తన పోర్టల్‌లో ‘స్టెప్-అప్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. నౌక్రీ.కామ్ యొక్క చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ మాట్లాడుతూ ఈ ప్రయత్నం ఈ ఉద్యోగ అన్వేషకుల ప్రొఫైల్‌లను రిక్రూటర్లకు హైలైట్ చేస్తుంది తద్వారా షార్ట్‌లిస్ట్ అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి అన్నారు.