న్యూఢిల్లీ: దేశంలో ఇప్పుడిప్పుడే కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతుండడంతో దేశీయ ఐటీ సంస్థలు తమ నియామక ప్రక్రియను వేగవంతం చేయడం మొదలుపెట్టాయి. ఐటీ సంస్థలకు వస్తున్న కొత్త ప్రజెక్టులతో డిమాండ్ తగ్గట్టుగా నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంతున్నాయి.
దేశియ అతిపెద్ద ఐటీ సర్వీస్ ప్రొవైడర్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసీస్, విప్రోలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే సుమారు లక్షకు పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. టీసీఎస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్నీ క్యాంపస్ ల ద్వార 40,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనుంది.
ఇక మరో దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫొసిస్ ఈ ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 35,000 మంది ఫ్రెష్ కళాశాల గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నట్లు కంపెనీ సీఏవో ప్రవీణ్ రావు క్యూ1 సంపాదన ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 35,000 కాలేజీ గ్రాడ్యుయేట్ల నియామకం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
మరో దేసీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో మొదటి త్రైమాసికంలో 10,000 కంటే ఎక్కువ ఇతర నియమకాలతో పాటు 2,000 కంటే తక్కువ ఫ్రెషర్లను నియమించుకుంది. అలాగే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6,000 ఫ్రెషర్లను నియమించికొనున్నట్లు విప్రో తెలిపింది.