ఏపీ: 1995లో ఐటీ సేవలను అందిపుచ్చుకుని పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని మరింత పెంచేందుకు మరో అడుగు వేశారు.
ఆ రోజుల్లో ఈ సేవా కేంద్రాలతో ప్రజలకు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చిన చంద్రబాబు, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆ సేవలను మరింత వేగంగా, సులభంగా ప్రజలకు అందించేందుకు సిద్ధమయ్యారు.
తాజాగా, రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కొత్త విధానం ద్వారా పౌరులు ఇంటి వద్ద నుంచే ప్రభుత్వ సేవలను పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
మొదటి విడతగా 161 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ సేవలను దీని ద్వారా కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
1995లో ఐటీ విప్లవాన్ని ముందుగా అర్థం చేసుకున్న చంద్రబాబు, ఇప్పుడు ఏఐ ఆధారిత పాలన వైపు దృష్టిపెట్టడం అతని దూరదృష్టికి నిదర్శనం.
గతంలో ఐటీతో ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అమలు చేసినట్లే, ఇప్పుడు ఏఐ ద్వారా మరింత వేగవంతమైన, పారదర్శకమైన పాలన అందించనున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.