కరీంనగర్: తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ లో పర్యటించనున్నారని మంత్రి గంగుల వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సరిగా ఐటీ టవర్‌ను కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తారని, అలాగే కరీంనగర్ పట్టణంలో 24 గంటల తాగునీటి పథకాన్ని కూడా ఈ సందర్బంగా ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు.
పట్టణంలో ప్రారంభిస్తున్న ఐటీ టవర్ ఐటీ టవర్ ద్వారా 3,500 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.