టాలీవుడ్: వచ్చే వారం మహా శివరాత్రి సందర్భంగా తెలుగు లో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో శర్వానంద్ శ్రీకారం, శ్రీ విష్ణు గాలి సంపత్ తో పాటు జాతి రత్నాలు అనే మరో చిన్న సినిమా విడుదలవుతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా ప్రొమోషన్ మాత్రం జోరుగా చేస్తున్నారు. దొరికిన ప్రతి అవకాశం వాడుకుంటూ ప్రమోషన్ మాత్రం పెద్ద సినిమాలకి తగ్గకుండా చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేయించారు. ఈ విడుదల ప్రాసెస్ కూడా ఒక కామెడీ వీడియో గా రూపొందించి విడుదల చేసారు. నవీన్ తో పాటు ఇండస్ట్రీ లో ఉన్న మరో ఇద్దరు సూపర్ టైమింగ్ ఆర్టిస్ట్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో నటిస్తుండడం తో కామెడీ పరంగా ఈ సినిమా పైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓవర్ యాక్షన్ కామెడీ, మంచి టైమింగ్ ఉన్న నటులు ఉండడం తో సినిమా ట్రైలర్ ఆద్యంతం ఫన్ సీన్స్ తో ఆకట్టుకుంది. ‘టెన్త్ లో 60 % ఇంటర్ లో 50% బీటెక్ లో 40% .. అందుకే ఎం.టెక్ చేయలేదు’ అనే ఫన్నీ డైలాగ్ తో ట్రైలర్ ఆరంభం అయింది. ట్రైలర్ మొత్తం దాదాపు ఇలాంటి డైలాగ్స్, సీన్స్ తో అలరించి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఒక హింట్ ఇచ్చారు మేకర్స్. మధ్యలో వెన్నల కిషోర్, ట్రైలర్ చివర్లో బ్రహ్మానందం కూడా కనిపించడం తో కామెడీ డబల్ డోస్ ఉండబోతుందని కూడా హింట్ ఇచ్చారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మించారు. కే.వీ.అనుదీప్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మార్చ్ 11 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది.