
జాక్ సండే పరీక్ష.. క్లిక్ కావాల్సిందే..
టిల్లు 2 సక్సెస్‌తో క్రేజ్ పెంచుకున్న సిద్ధు జొన్నలగడ్డ తాజాగా జాక్ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చినా, థియేటర్ల వద్ద మొదటి రోజే నెగెటివ్ టాక్ ఎదురై బిజినెస్ మీద ప్రభావం చూపింది.
మొదటి రోజు ఓపెనింగ్స్ మామూలుగా ఉన్నా, రెండో రోజు నుంచి కలెక్షన్లు డ్రాప్ కావడం డిస్ట్రిబ్యూటర్లను ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం మేకర్స్ లాంగ్ వీకెండ్ హోప్ మీద ఉన్నారు. శనివారం, ఆదివారం, సోమవారం సెలవులను క్యాష్ చేసుకోకపోతే థియేట్రికల్ రికవరీ కష్టమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
హైదరాబాద్, కొన్ని అర్బన్ ఏరియాల్లో యూత్ ఆడియన్స్ జాక్‌కు వస్తున్నా.. మాస్ ఆడియన్స్ కనెక్ట్ కావడం లేదు. స్టోరీ రొటీన్ అయినా, డిఫరెంట్ ట్రీట్‌మెంట్, ఫన్ సీన్స్ ఎక్కడికక్కడ పని చేశాయి. కానీ ఎమోషనల్ డెప్త్ లేకపోవడం ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.
డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మిన నిర్మాతలు డీల్స్‌తో లాభాల్లో ఉన్నా, థియేట్రికల్ బిజినెస్ కష్టాల్లో ఉంది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బు రికవర్ కావాలంటే ఈ లాంగ్ వీకెండ్ కీలకమని చెప్పాలి. మొత్తానికి జాక్‌కు ఈ మూడు రోజులు డిసైసివ్‌గా మారబోతున్నాయి.