సిద్దు జొన్నలగడ్డ జాక్ మూవీ రివ్యూ & రేటింగ్
కథ:
చిన్ననాటి ఘటనతో మానసికంగా ప్రభావితమైన జాక్ అలియాస్ పేబ్లా నెరుడా (సిద్ధూ జొన్నలగడ్డ) రా ఏజెంట్‌గా మారుతాడు. తన దృక్పథంలోనే న్యాయం చేయాలనే ఆలోచనతో ఓ టెర్రరిస్ట్ మిషన్‌ను ఛాలెంజ్ చేస్తాడు. అయితే అదే సమయంలో అధికారికంగా జరుగుతున్న మిషన్‌లో మనోజ్ (ప్రకాష్ రాజ్) సారథ్యం వహిస్తున్నాడు. ఇద్దరి మార్గాలు ఎక్కడ కలిశాయి? రెహ్మాన్ అనే టెర్రరిస్ట్ ఎవరు? అసలైన క్యాట్ ఆపరేషన్ వెనక ఉన్న ప్లాన్ ఏమిటి? అన్నదే కథా గాథ.
విశ్లేషణ:
‘జాక్’ సినిమా ఫస్ట్ హాఫ్ లోనే మంచి పేస్ తో కథను ప్రారంభిస్తుంది. సిద్ధూ జొన్నలగడ్డ ఎంట్రీ, బ్యాక్ స్టోరీ, రా ఏజెంట్‌గా మారిన తీరును నేచురల్ గా చూపించారు. డైలాగ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్‌ల మిక్స్ బాగా కుదిరింది. సిద్ధూ, వైష్ణవి మధ్య వచ్చే సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటాయి. ముఖ్యంగా ఫన్ తో పాటు మంచి థ్రిల్ ఎలిమెంట్స్ ఉండడం ఆడియన్స్ ను మొదటి భాగంలో గట్టిగా ఎంగేజ్ చేస్తుంది. దాంతో పాటు సాంగ్స్ కూడా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం కథనంలో ఆసక్తి కొంత తక్కువవుతుంది. రా ఆపరేషన్, టెర్రరిస్టు ప్లాన్, క్యాట్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్‌లు ఆసక్తికరంగా ఉండాల్సిన సమయంలో ఫిలింగా అనిపించే ఎమోషనల్ ఎలిమెంట్స్, డ్రామా లేక్కపోవడంతో కథనం డీప్ లోకి వెళ్ళదు. క్లైమాక్స్ ట్రాక్ చాలా సింపుల్ గా, ఊహించదగిన తరహాలో ఉండటం ఆసక్తిని తగ్గిస్తుంది. విలన్ బిల్డ్ అప్ బలంగా ఉన్నా.. చివరికి ఆయన పాత్ర ఎక్కువ ఇంపాక్ట్ చూపించలేకపోయింది. వైష్ణవి పాత్రను ఎక్కువగా ఫిల్లర్ లా వాడినట్టు ఫీల్ అవుతుంది.
టెక్నికల్ గాను సినిమా సాధారణ స్థాయిలోనే ఉంది. మంచి ప్రొడక్షన్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమా అయినప్పటికీ, కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ మినహా పెద్దగా ఆకట్టుకునే స్థాయిలో లేవు. సంగీతం, సినిమాటోగ్రఫీ డీసెంట్. దర్శకుడు భాస్కర్ కథ ఎంపికలో ప్రయోగం చేశారనిపిస్తుంది. స్పై థ్రిల్లర్‌కు సరిపడే మూడ్ క్రియేట్ చేశారు కానీ, కథనం కాస్త పాతగా, ఫార్ములా లాగా మారడంతో ఫుల్ ఎఫెక్ట్ తక్కువైంది. మొత్తానికి ‘జాక్’ ఓసారి చూడదగ్గ స్పై డ్రామా.
ప్లస్ పాయింట్స్:
1. సిద్ధూ జొన్నలగడ్డ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్
2. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, యాక్షన్ బాగా బలంగా ఉండటం
మైనస్ పాయింట్స్:
1. సెకండ్ హాఫ్‌లో ఊహించదగిన కథనం
2. వైష్ణవి పాత్ర ప్రాసెసింగ్ లో లాగీగా అనిపించడం
3. విజువల్ ఎఫెక్ట్స్ మోస్తరుగా ఉండటం
రేటింగ్: 2.5/5