న్యూఢిల్లీ: భారత స్టార్ అల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించాడు. అతను తన రిటైర్మెంట్ కు అందుకు చాలా సమయం ఉందంటూ ట్విటర్ వేదికగా తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు.
తాను పరిమిత ఓవర్ల ఫార్మాట్లు అయిన టీ20, వన్డేలపైనే దృష్టి సారించేందుకు టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు వచ్చిన వార్తలను జడేజా ఖండించాడు. ఆ వార్తలన్నీ గాలి వార్తలనేనని తాను కొట్టిపారేశాడు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో టెస్ట్ జెర్సీ ధరించిన ఫోటోను పోస్ట్ చేసి తన అభిప్రాయాన్ని తెలిపాడు.
ఇటీవల భారత్ లోనే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా జడేజా గాయపడ్డాడు. ఈ సిరీస్‌లో కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆడిన జడేజా, ఆ మ్యాచ్ లో గాయం వల్ల రెండవ టెస్ట్‌కు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెలెక్టర్లు అతన్ని దక్షిణాఫ్రికా పర్యటనకు సెలెక్టర్స్ ఎంపిక చేయలేదు.
తనకు తగిలిన ముంచేతి గాయానికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న జడేజా, తిరిగి కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. జడేజా టీమిండియా తరఫున 57 టెస్ట్‌ల్లో 232 వికెట్లు సాధించడంతో పాటు 2195 పరుగులు కూడా సాధించాడు.