ముంబై: టీమిండియాకు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే పెద్ద షాక్ తగిలింది. ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా గాయపడిన రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో గాయపడిన జడేజా గబ్బా టెస్టుకు దూరమయ్యాడు.
అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి జడేజా బొటనవేలికి చాలా బలంగా తాకింది. దీంతో జడేజాకు ఆస్ట్రేలియాలోనే సర్జరీ నిర్వహించిన వైద్యులు తనకు కనీసం ఆరువారాల విశ్రాంతి అవసరమని చెప్పారు. దీని వల్ల ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమవడంతో పాటు వన్డే సిరీస్‌లోనూ ఆడడం అనుమానంగానే ఉంది.
అనంతరం అతని ఫిట్‌నెస్‌ను పరీక్షించి పరిమిత ఓవర్లలో ఆడేది లేనిది సెలక్టర్లు నిర్ణయిస్తారని బీసీసీఐ తెలిపింది. కాగా ఆసీస్ పర్యటన ముగించుకొని గురువారం ఉదయం ఇతర టీమిండియా క్రికెటర్లతో కలిసి జడేజా భారత్ చేరుకున్నాడు. రిహాబిలిటేషన్ కోసం జడ్డూను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపనున్నారు.
జడేజా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆ మ్యాచ్‌లో బంతి హెల్మెట్‌కు బలంగా తాకడంతో కంకషన్‌కు గురయ్యాడు. అతని స్థానంలో వచ్చిన చహాల్ మ్యాచ్ గెలిపించిన సంగతి తెలిసిందదే. అనంతరం ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో బరిలో దిగిన జడ్డూ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు.