బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని, ఆయన గురించి మాట్లాడకపోవడమే మంచిదని అన్నారు.
కోమటిరెడ్డి మాట్లాడే పదాల్లో ఎలాంటి సబ్జెక్ట్ లేదని, ప్రజలకు ఉపయోగపడే అంశం ఏమీలేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
“మేము, హరీశ్ రావు, కేటీఆర్ అందరం మాట్లాడిన మాటల్లో సబ్జెక్ట్ ఉంటే తప్ప మరొకటి ఉండదు. ఏ బూతు పదాలను ఉపయోగించము, వ్యక్తిగత విషయాల్లోనూ మాట్లాడము,” అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
కానీ, కోమటిరెడ్డి మాట్లాడిన అంశాలు ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఉపయోగపడుతున్నాయని ఆరోపించారు.
“తెలంగాణలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకు కోమటిరెడ్డి చిల్లర చేష్టలు చేస్తున్నారు. కానీ మేము అలాంటి వాటిలోకి పోదల్చుకోవడానికి సిద్ధంగా లేము,” అని అన్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలపై కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉండటం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్‌గా స్పందించాయి.