ఏపీ: కోటంరెడ్డి: ప్రతిపక్ష నేతగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంపై విమర్శలు మరింత ముదురుతున్నాయి. ప్రస్తుతం జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం రాజీనామా చేయాలని, డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్లకు దారి తీసింది.
అయితే, జగన్ అసెంబ్లీకి ఎందుకు రారో, ఆయన అసెంబ్లీకి రావడానికి ఏ చిట్కా ఉపయోగపడుతుందో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.
“జగన్‌కు రోజుకు గంట మాట్లాడే అవకాశం ఇస్తే ఆయన మంగళవారం నాడే అసెంబ్లీకి వస్తారు,” అని కోటంరెడ్డి పేర్కొన్నారు.
జగన్ ఇతరుల మాటలు వినడం ఇష్టపడరని, మైక్ మాత్రమే తనకు కావాలని తపిస్తారని ఆయన సెటైర్లు వేశారు.
2017లో పాదయాత్రకు వెళ్తున్న సమయంలో కూడా జగన్ తన బాధ్యతలను ఇతరులకు అప్పగించకుండా తానే అన్ని నియంత్రణలు చేపట్టారని గుర్తు చేశారు.
కోటంరెడ్డి జగన్‌ను చూసి చాలా రోజులయిందని, అసెంబ్లీకి రావడం మానేసి ప్రజా సమస్యలపై పోరాడడం కంటే, వ్యక్తిగత కారణాలనే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్ష హోదా లేనప్పటికీ సభకు రాగానే వారికి తగినంత సమయం ఇస్తామని స్పీకర్ అయ్యన్న ప్రకటన చేసినా జగన్ స్పందించకపోవడం నిరాశ కలిగిస్తోందని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల వేదికపై జగన్ మాట్లాడుతూ ఎవరూ అడ్డుకోవద్దని, అది జగన్ ఫిలాసఫీ అని కోటంరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అసెంబ్లీకి జగన్ రావడం, ప్రజా సమస్యలపై చర్చించడమే అసలు ప్రతిపక్ష నేతగా ఆయన కర్తవ్యం అని గుర్తుచేశారు.