ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా తనకే కావాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పట్టుదలగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కోర్టును కూడా ఆశ్రయించిన ఆయన, తాను ప్రతిపక్ష నేతగా గుర్తించకపోతే అసెంబ్లీకి రావొద్దని సంకేతాలు పంపించారు. అయితే ప్రభుత్వ వైఖరి మాత్రం స్పష్టంగా జగన్‌కు వ్యతిరేకంగా ఉంది.
తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నిర్ణయాలు కోర్టు తీర్పు ఆధారంగా కాకుండా, ప్రజల తీర్పు మేరకే ఉంటాయని స్పష్టంచేశారు. 11 సీట్లు సాధించిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యమా? అని స్పీకర్ ప్రశ్నించారు.
రాజకీయంగా జగన్ దీనిని ముఖ్య అంశంగా తీసుకుని కోర్టులో పోరాటం కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ సమావేశాలను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహిస్తోంది. బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు పూర్తవగా, జగన్ హాజరవుతారా? లేదా అసెంబ్లీ నుంచి గైర్హాజరు కారణంగా అనర్హత వేటును ఎదుర్కొంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.