ఏపీ: మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ చర్య తీసుకుంది. దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తులపై ఇకపై లావాదేవీలు జరిపేందుకు ఈడీ అనుమతి తప్పనిసరి కావడం విశేషం.
ఈ కేసు నేపథ్యం లోకి వెళితే.. వైఎస్ హయాంలో దాల్మియా కంపెనీకి కడప జిల్లాలో సున్నపురాయి గనుల అనుమతులు లభించాయి. ఈ అవకాశానికి ప్రతిఫలంగా దాల్మియా సంస్థ, జగన్‌కు చెందిన రఘురామ్ సిమెంట్స్‌లో రూ.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
అదే సమయంలో కంపెనీ మరో రూ.55 కోట్లను నేరుగా మనీ లాండరింగ్ రూపంలో పంపిందని ఈడీ పేర్కొంది. మొత్తంగా రూ.150 కోట్ల మేర ప్రయోజనం ఇచ్చిన ప్రతిఫలంగా ప్రభుత్వం లబ్దులు ఇచ్చిందని ఆరోపిస్తోంది.
ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. అయితే తాజా ఆస్తుల అటాచ్ ప్రక్రియ జగన్ అక్రమాస్తుల కేసును మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.
ఈ పరిణామంతో దాల్మియా సంస్థపై ఆర్థిక పర్యవేక్షణ పెరుగనుంది. జగన్ కేసు మళ్లీ ప్రధాన రాజకీయ చర్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
jaganmohanreddy, ed, dalmia, illegalassets, apnews,