ఏపీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనంగా పేర్కొంటూ, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
జగన్ మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం ఆరు నెలల పాలనలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించారు.
పార్టీ నాయకులు ప్రజల తరఫున గళమెత్తి, న్యాయం కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, అదే విధానంతో ప్రజల కోసం పనిచేస్తామని జగన్ స్పష్టంచేశారు.
విద్య, ఆరోగ్యం, ఉపాధి, పథకాల అమలు వంటి కీలక అంశాలలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలకు కరెంట్ ఛార్జీలు, ఇతర బాదుడులు పెరిగాయన్నారు.
టీడీపీ పాలన అవినీతి, మోసాలపై ఆధారపడిందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వైసీపీ నాయకులు సమష్టిగా పనిచేయాలని, ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడమే ప్రధాన లక్ష్యమని జగన్ తెలిపారు.