తాడేపల్లి: కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని వస్తున్న ఆరోపణలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు.
తాడేపల్లిలో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ నేతల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలకే ఈ ఆరోపణలు రావడం హాస్యాస్పదమని అన్నారు.
జగన్ తన ప్రసంగంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కూటమి కంటే ఆధీనంలో ఉందని స్పష్టం చేశారు.
చెక్ పోస్టులు, పోర్ట్ కస్టమ్స్ సిబ్బంది, భద్రతా సిబ్బంది మొత్తం కూటమి నియామకులేనని, ఇలాంటి పరిస్థితుల్లో రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందంటే ఆరు నెలల కూటమి పాలన వైఫల్యమే కారణమని తెలిపారు.
మాజీ మంత్రి పయ్యావుల కేశవ్‌పై నేరుగా విమర్శలు చేయడం గమనార్హం. కేశవ్ వియ్యంకుడు రేషన్ బియ్యం ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
అయితే కూటమి నేతలు తనిఖీలు చేస్తున్న పేరుతో కేశవ్ కుటుంబ సభ్యుల షిప్‌ను మాత్రం అనుమతిస్తున్నారని జగన్ ఆరోపించారు.