అమరావతి: కూతురు వర్షా స్నాతకోత్సవం సందర్బంగా కుటుంబ గర్వకారణం అంటూ జగన్ భావోద్వేగ ట్వీట్ చేసారు.
లండన్ పర్యటనలో జగన్ దంపతులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతికి తమ చిన్న కుమార్తె వర్షా రెడ్డి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రముఖ కింగ్స్ కాలేజ్ లండన్‌లో వర్షా రెడ్డి డిస్టింక్షన్‌తో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టభద్రురాలైన సందర్భాన్ని కుటుంబం ఎంతో ఘనంగా జరుపుకుంది.
జగన్ భావోద్వేగ ట్వీట్
వర్షా రెడ్డి పట్టభద్రురాలైన నేపథ్యంలో జగన్ ఎక్స్‌లో పోస్టు చేయడం గమనార్హం. ‘‘అభినందనలు డియర్ వర్షా! ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ లండన్‌లో డిస్టింక్షన్‌తో పట్టభద్రురాలవడం మాకు గర్వకారణం. నీపై దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
వైఎస్ జగన్ కుటుంబ గర్వకారణం
వైఎస్ జగన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు: హర్షా రెడ్డి, వర్షా రెడ్డి. పెద్ద కుమార్తె హర్షా, చిన్నతనం నుంచే చదువులో అద్భుత ప్రతిభను కనబరిచారు. 2017లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎకనామిక్స్‌లో అండర్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షా, తదనంతరం ఫ్రాన్సులో ఎంఎస్ పూర్తిచేసి.. ప్రస్తుతం లండన్‌లో ఒక ప్రముఖ సంస్థలో సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు.
వర్షా రెడ్డి విద్యా ప్రస్థానం
చిన్న కుమార్తె వర్షా రెడ్డి అమెరికాలోని నోట్రే డామ్ విశ్వవిద్యాలయంలో విద్యను ప్రారంభించి, ఆ తర్వాత కింగ్స్ కాలేజ్ లండన్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డిస్టింక్షన్ సాధించడం వర్షా ప్రతిభకు నిదర్శనం.
వైసీపీ శ్రేణుల నుంచి అభినందనలు
వర్షా రెడ్డి స్నాతకోత్సవం సందర్భంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతూ, సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.