వైసీపీ అధినేత జగన్, తన తల్లి విజయమ్మ, సోదరి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిలపై న్యాయపోరాటానికి దిగారు. ఈ వివాదంలో బెంగళూరులోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో షేర్ల విషయంలో మోసం జరిగిందని ఆరోపిస్తూ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) లో పిటిషన్ దాఖలు చేశారు.
జగన్ తన తల్లి విజయరాజశేఖరరెడ్డికి 48.99% షేర్లు ఇచ్చినట్టు తెలిపారు. అందులో తనకు 29.88% మరియు భారతి పేరుతో 16.33% షేర్లు ఉన్నాయని చెప్పారు. కానీ, షర్మిల తన తల్లికి కేటాయించిన షేర్లను కుట్ర పూరితంగా స్వాధీనం చేసుకున్నారంటూ ఆయన ఆరోపించారు.
తనకు తెలియకుండా ఈ షేర్లు బదలాయించబడడం తప్పుడు విధానమని, షర్మిలతో ఉన్న రాజకీయం విభేదాల నేపథ్యంలో ఆమెకు షేర్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు జగన్ పేర్కొన్నారు. అందుకే, ట్రైబ్యునల్ షర్మిల తీసుకున్న షేర్లను రద్దు చేసి, తమకు 51.01% షేర్లు కేటాయించాలని కోరారు.