కడప: విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు స్టార్ట్ అయ్యాయి.
కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల నడ్డి విరగ్గొడుతోందని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ నిరసనలు చేపట్టినట్లు వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జగన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పార్టీ క్యాడర్‌ను అభినందించారు. “ప్రజల కోసం మీ అంకితభావం, చిత్తశుద్ధి అసమానమైనది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజల కోసం చేపట్టిన నిరసనలు గొప్పగా సాగాయి. ఇది నిజమైన ప్రజాస్వామ్య పోరాటానికి నిదర్శనం,” అంటూ జగన్ శ్రేణులకు మద్దతు తెలిపారు.
పార్టీ శ్రేణులు ప్రజల తరఫున నిరసనలు వ్యక్తం చేయడాన్ని జగన్ ప్రశంసిస్తూ, ఆందోళనలు ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడాలని ఆకాంక్షించారు. ప్రజల పక్షాన వైసీపీ తీసుకుంటున్న ఈ చర్యలు పార్టీ అంకితభావాన్ని సూచిస్తాయని అన్నారు.